ప్లాస్టిక్ స్క్రబ్ లు, స్పాంజ్ ల కన్నా బీరకాయి పీచు మంచిదని దీన్ని ప్రాసెస్స్ చేసి రంగుల్లో అందంగా  చేసి మరీ విక్రయిస్తున్నారు. ఆధునిక స్పాల లో వీటి వాడకం పెరిగింది. పర్యావరణానికి హాని చేయని ఈ బీరకాయ పీచుతో సబ్బులు, సౌందర్య లేపనాలు లోషన్లు తయారుచేస్తున్నారు. సంచులు, పరుపులు, దిండ్లు, చెప్పులు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. సాధారణ బీరకాయ కన్నా నేతి బీర పీచుతో చేసే స్పాంజి, స్క్రబ్ లేక్ డిమాండ్ ఉంది. కాయని ఎండబెట్టి పై తొక్క తీసేసి ఈ పీచు ప్యాక్ చేస్తారు. ఈ బీర, నేతి బీరలో ఉండే పీచు వంటి పైన వుంటే మృత కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మ కణాల్లో రక్త ప్రసరణ మేగయ్యేలా చేసి స్వేద రంధ్రాలను తెరుచుకోనేట్లు చేసి వ్యర్థ పదార్ధాలను తొలగిస్తుంది. ఈ పీచు ఆరోగ్యాన్ని పెంపొందించే ఔషధం.

Leave a comment