గోధుమ పిండి ప్యాక్ నల్ల మచ్చలు నలుపు పోతుందని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఆరోగ్యానికే కాదు, అందానికి మేలు చేసే గోధుమల ప్యాక్స్ చక్కని ఫలితం ఇస్తుందని చెప్పుతున్నారు. మూడు చెంచాల గోరువెచ్చని పాలు చెంచా గులాబీ నీరు, కొద్దిగా తేనె, గోధుమ పిండి కలిపి ముఖానికి ప్యాక్ గా వేసుకుని ఆరాక కడిగేసి మాయిశ్చురైజర్ రాసుకోవాలి. అలాగే పాల మీగడ తో గోధుమ పిండి కలిపి ఆ పాక్ వేసినా మంచి ఫలితం వుంటుంది. అలాగే గోధుమ పిండిని కలిపి ముఖానికి మెడకు పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి కడిగేస్తే జిడ్డు పోయి మొహం కంటి తో మెరుస్తుంది. అలాగే కప్పు వేడి నీటి లో గులాబీ రేకులు, తేనె, నిమ్మ తొక్కల పొడి వేసి ఇందులో గోధుమ పిండి కలిపి ముఖానికి పాక్ వేస్తె ముఖం లోని ముడతలు మాయమై పోతాయి చర్మం మృదువుగా మారిపోతుంది.

Leave a comment