వర్షాకాలంలో ఆహార పానీయాల విషయంలో ఎంత జాగ్రత్త చూపించినా తక్కువే. యాంటీ బాక్టీరియల్ గునాలున్న ఆహారం తినాలి. ఈ సీజన్ లో పెరుగు బాగా తినాలి. ఇది చెడు బాక్టీరియాను నశింపజేసి మంచి బాక్టీరియాను వృద్ది చేస్తుంది. ఉదర సంబందిత ఇన్ ఫెక్షన్స్ ను తగ్గించడం లో అరటి పండు పని చేస్తుంది. అరటి పండు లో వుండే పొటాషియం వల్ల తిన్న వెంటనే శక్తి వస్తుంది. అలాగే పంచదార లేకుండా అల్లం వేసిన టీ తాగాలి. పాలల్లో పసుపు వేసి తీసుకోవచ్చు ఇవన్నీ వర్షపు రోజుల్లో శక్తి ఇచ్చే ఆహారాలు అలాగే పళ్ళు కూరగాయలు కడిగి వాడుకోవడం మంచిది.

Leave a comment