భానుడి ప్రతాపం మొదలైంది . ఇప్పటివరకు షిఫాన్ లు జార్జెట్ రాసిల్క్ లు పక్కన పడేసి ఎండ వేడి తట్టుకునేందుకు ఇక మెత్తని చీరలు సౌకర్యం సొగసైన దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఖద్దరు మంగళగిరి కాటన్స్ నూలు లెనిన్ రేయాన్ పోచంపల్లి వంటివి ఇక కొలువు దీరతాయి. మంగళగిరి నూలు కలంకారీ అద్దకాలు ఇకత్ తో మెర్సీ డైజ్డ్ కాటన్ కాటన్ సిల్క్ తో కుర్తీలు స్కర్టులు టాప్ లు చక్కగా ఉంటాయి . ఇవే కాస్త ఖరీదుగా కనిపించాలంటే ముదురు రంగు బేస్ ఫ్యాబ్రిక్ ఎంచుకుని దానికి జతగా థ్రెడ్ వర్క్ అంచులు డిజైన్లు చిన్నవిగా ఉండేలా చూసుకుంటే చాలు. లేత రంగులు వేడి తీసుకుని శరీరానికి చల్లదనం ఇస్తాయి. అలాగే మత్ కాటన్ మంగళగిరి చీరాల పైన బ్లాక్ ప్రింట్ చేయించుకుంటే చూసేందుకు  చాలా బావుంటాయి. పైగా ఎండ వేడినించి  తప్పించుకునే బెస్ట్ సెలెక్షన్ ఇవే

Leave a comment