వర్షాలు పడే ఈ సీజన్ లో అలసటగా, బద్దకంగా నిద్ర వస్తున్నట్లు వుంటుంది. దీనికి శాస్త్రీయ కరణాలు పెంపొందుతూ వుంటే, మానవ శరీరం ఉత్పత్తి చేసే మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రపోవటాన్ని మెలకువగా ఉండటానికి సంబందించిన సైకిల్ ను క్రమబద్దీకరిస్తుంది. ఈ మెలటోనిన్ ఉత్పత్తి ఎక్కువగా సూర్యకాంతి పై ఆధారపడి వుంటుంది. అలాగే సంతోషానిచ్చే సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తిసూర్యకాంతి లేకపోవడం వల్ల తగ్గిపోతుంది. అలాగే సూర్యకాంతి లేక విటమిన్ డి ఉత్పత్తి ఆగిపోతుంది. ఈ కారణాల వల్లే బద్ధకం, డిప్రెషన్, ఇలాగే వుంటే కాస్తంత సూర్యకాంతి లోనైనా తిరగడం, వాకింగ్ చేయడం, గాలిలో తిరగడం, నీరు వీలైనన్ని తాగడం వల్ల అలసట కలగదు. కార్బోహైడ్రేడ్స్, చక్కెర తక్కువగా వుండే ఆహారం తీసుకోవడం వల్ల కుడా శరీరం చురుగ్గా ఎలర్ట్ గా వుంటుంది.

Leave a comment