ఈ సీజన్ లో చలి గాలుల వల్ల జ్వరాలు ఇతర ఇన్ఫెక్షన్లు ఎక్కువే. ద్రవ పదార్ధాలు ముఖ్యంగా సూప్ లు, టీ, కాఫీ వంటి వెచ్చని ద్రవాలు తాగడం వల్లనే ఇన్ఫెక్షన్ లను దూరంగా ఉంచొచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, వీలైనన్ని సార్లు తినాలి. పెరుగు, ఓట్స్, బార్లీ, వెల్లుల్లి, చికెన్ సూప్, గ్రీన్ టీ, చిలకడ దుంపలు, లవంగాలు, అల్లం, మిరియాలు, పాసుపు, క్యాప్సికం, పాల కూర, బాదాం పప్పులు, పసుపు రోగ’ నిరోధక శక్తిని పెంచుతాయి. చలిగా వున్నా సరే పావు గంట సేపు బ్రిస్క్ వాకింగ్ లేదా ఇతర ఏరోబిక్ వ్యాయామాలు ఏవి చేసినా రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వీలైనంత సేపు శరీరానికి సూర్య రశ్మి సోకే లాగా జాగ్రత్త పడాలి. బాగా నిద్రపోవాలి. ఆహారంలో ఐరన్ కి కీలక పాత్ర. విటమిన్-సి వుండే పదార్ధాలు తినడం వాల్ల శరీరం ఐరన్ ను బాగా గ్రహించగలుగుతుంది.

Leave a comment