శీతాకాలం వణికించే చలి లో పొగ మంచు వల్ల అనార్గ్యాలు వస్తాయి. శారీరక శక్తి కోసం కొన్ని ముఖ్యంగా తినాలంటున్నారు ఎక్స్ పర్ట్స్. క్రాన్ బెర్రీస్ పళ్ళలో విటమిన్ C,E,A లు ఎక్కువగా వుంటుంది. ఓట్ మీల్ లో క్రాన్ బెర్రీస్ కలిపి, నట్స్ , వేయించన బాదాం పప్పులు తిన్నా కుడా మంచి ఫలితం అలాగే వాల్ నట్స్ మూడ్ భూస్టర్స్ లా పని చేస్తాయి. కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. వీటి తో శరీరం లోని వ్యర్ధాలు విష పదార్ధాలు పోతాయి. అలాగే ఈ సీజన్ లో బెల్లం ఎక్కువగా ఉపయోగించుకోవాలి. ఇందులో ఐరన్ చాలా ఎక్కువ. శరీరంలోని హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. సీజనల్ గా వచ్చే అనారోగ్యాల బారి నుంచి బయట పాడేందుకు బలమైన ఆహారం తీసుకోవడమే మంచి మార్గం.

Leave a comment