శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయి జలుబు, దగ్గు దాడి చేయడం సహజం. వీటిలో కొంచెం టీ పొడి, అల్లం రసం, దాల్చిన చెక్క పొడి కలిపి, మరగనిచ్చి, తేనె కలిపి తాగితే రిలాక్స్ గా వుంటుంది. వీటిలో యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. తేనె గొంతులో గరగారను తగ్గిస్తే అల్లం రోగ నిరోధక వ్యవస్ధను మెరుగు పరుస్తుంది. అలాగే నిమ్మలోని విటమిన్ సి శ్వాస సంబందిత సమస్యల్ని క్లియర్ చేస్తుంది. ఈ టీ తాగినండు వల్ల జలుబు లక్షణాలు తగ్గిపోతాయి. శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. బెల్లమ, మిరియాల పొడి వేసిన పాలు తాగినా రిలీఫ్,రాత్రి పడుకునే ముందర పాలు, పసుపు, బెల్లం, మిరియాల పొడి కలిపి వేడిగా తాగితే నిద్ర కుడా బాగా పడుతుంది.

Leave a comment