టీ తోనే రోజు ప్రారంభించె వాళ్ళు ఎంతో మంది. ఇది కేవలం ఉదయపు పానీయం కాదు. ఇందులో మూడ్ ను పెంచే అనేక రసాయినాలున్నాయి. డార్జలింగ్ రోజ్ గ్రీన్ టీ, ఇటాలియన్ సెజ్ టీ ని స్త్రీలు చాలా ఇష్టంగా తాగుతారని ఒక సర్వే రిపోర్టు. అయితే టీ తో మనం ఎన్నో ప్రయోగాలు చేయిచ్చు. సంప్రదాయ తేయాకు తెట్ట దవనం లేదా వాము ఆకులతో కలిపి నిల్వ చేయాలి. దాన్ని సరిగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమం తో చేసిన టీ అద్భుతం అలాగే తేయాకును పువ్వులతోనూ, మాలికలతోనూ, డ్రై ఫ్రూట్స్ తో నూ కలిపి నిల్వ చేస్తే ప్రతి టీ ఒక కొత్త రుచితో సంతోష పెట్టేదే. మధుమేహం తో బాధ పడే వాళ్ళకోసం, సీమబంతి ఆకులూ, లావెండర్ ఆకులూ, ఆకుపచ్చ మల్చరీ ఆకులూ, అశ్వగంధ కలిపి డార్జిలింగ్ తేయాకు తో టీ తయ్యారు చేసి ఇస్తారు. డార్జిలింగ్ లోని టీ లల్లో షాంపెన్ లాంటిది. ఈ ఆకులు డార్జిలింగ్ లోని టీ తోటల్లోనుంచి వస్తాయి. ఉత్తేజాన్ని ఇచ్చే రుచి తో వుంటుంది.

Leave a comment