మనకి వంట బాగా వచ్చినా సరే అనుభవం ఉన్నవాళ్ళు చెప్పిన కిటుకులు పాటిస్తే వండే వంట మరింత టేస్టీ గా వుంటుంది. కాఫీ ఫిల్టర్ లో పంచదార వేసి ఆ తరువాత కాఫీ పొడి, వేడి నీళ్ళు పోస్తే కాఫీ టేస్టీ గా వుంటుందట. ఇలా ట్రై చేసి వుందం కదా. ఇంకోటి కోడి గుడ్డు సొనలో కొన్ని పాలు లేదా టేబుల్ స్పూన్ నీళ్ళు కలిపి ఆమ్లెట్ వేస్తే రుచిగా వుంటుంది, చూసేందుకు కూడా బావుంటుంది. కాలీఫ్లవర్ వండేప్పుడు ఓ టేబుల్ స్పూన్ పాలు పోస్తే కాలీఫ్లవర్ రంగు మారదు. బెండ కాయలు వేయించేప్పుడు పెరుగు ఓ స్పూన్ కలిపితే వేపుడు కరకరలాడుతుంది. ముక్కలు అతుక్కోవు. మిక్సీ లో ఇడ్లీ పిండి రుబ్బితే ఇడ్లీలు గట్టిగా వస్తుంటే ఇడ్లీ రవ్వ వేడి నీళ్ళలో నాననివ్వాలి. వెల్లుల్లి, అల్లo పేస్టు ఎక్కువగా మిగిలిపోతే అందులో కాస్త వేడి నూనె పోసి కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. పకోడీ పిండి కలిపాక అందులో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే పకోడీలు కరకరలాడతాయి.
Categories