రాజ్ గిరా ని థర్డ్ మిలీనియం గ్రెయిన్ అని పిలుస్తున్నారు. పోషకాల పరంగా అవి ప్రోటీన్స్ కు నిల్వలు. సింపుల్ గా చెప్పాలంటే అవి తోటకూర గింజలు. ఇవి గసగసాల్లా ఉంటాయి. తోటకూరలో 60 రకాల జాతులకు పైగానే ఉన్నాయి. మనకు తెలిసిన తోటకూర గింజలు నల్లగా ఉంటాయి. అమరాంధన్, కాటేటస్, క్రుయంటస్, హైపో కాండ్రియకస్ అనే తోటకూర రకాలను గింజల కోసం పండిస్తారు కానీ ఆకులు వేళ్ళూ పోషకభరితం కావడంతో గింజలతో పాటు వీటిని తింటారు. ఉత్తరాదిన శ్రావణమాసం లోనూ, నవరాత్రుల సమయంలోనూ చేసే ప్రసాదాల కోసం రాజ్ గిరా పిండిని ఉపయోగిస్తారు. లడ్డూలు, చిక్కీలు, పాయసం, పూరీలు, రోటీలు లాంటి ఎన్నో రకాల వంటలు వండుతారు. మన హెల్త్ ఫుడ్ స్టోర్స్ లో ఈ ధాన్యం దొరుకుంతుంది. కొన్ని మున్సిపల్ స్కూళ్ళలో మధ్యాహ్న భోజనంలో భాగంగా ఈ ధాన్యంతో చేసిన వంటలని పెడుతున్నారంటే ఇవి ఎంత బలవర్ధకమో తెలుసుకోవచ్చు. మిగిలిన ఏ గిన్జల్లోను దొరకని లైసీన్ అనే ప్రోటీన్ రాజ్ గిరా లో సమృద్దిగా దొరుకుతుంది.

Leave a comment