నీహారికా,

టీనెజ్ అన్నది జీవితంలో అతి ముఖ్యమైన ఒక ఆమంచి మలుపు. ఈ వయస్సులో వచ్చే అనుభవాలే పెద్దయ్యాక అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. అప్పుడు నేర్చుకొన్న మంచి విషయాలు ఎదిగాక మంచి జీవితం గడపడానికి సహకరిస్తాయి. అందుకే యుక్త వయస్సులో అడుగు పెడుతున్న వాళ్ళతో దృఢమైన బంధాలు, అనుకూలమైన అనుసంధానంతో వుండాలి. అదే సమయంలో ఎదుటి వాళ్ళ ప్రలోభాలకు గురి కాకుండా తమ స్వతంత్ర ప్రతి వత్తిడిని కాపాడుకోవాలి. ఈ అంశాన్ని సమర్ధవంతంగా జీవితానికి అన్వయించుకోకపోతే సమస్యలకు గురి కాక తప్పదు. అవయివాలు తేలికగా దేని కైనా లొంగిపోయెంత బలహీనమైన మనస్సుతో వుంటారు. ఇంకా పరిణితి చెందిన వయస్సు అది. అలాగే స్నేహితులతో మంచి భాందవ్యం కలిగి వుంటే తర్వాత జీవితం మొత్తంగా ఆ స్నేహ గుణాన్ని కోల్పోకుండా ఉంటారని ఎక్స్ పర్ట్స్ చెపుతారు. ఎదిగే వయస్సులో పిల్లలు తమ తల్లిదండ్రుల తోడ్పాటుతో, సలహాలతో జీవితాన్ని సైపున్యంగా తీర్చి దిద్దుకోవాలి. ఈ వయస్సు పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏ వ్యామొహాల జోలికి వెళ్ళకుండా కాపాడుకోవాలి.

Leave a comment