‘మీ పెదవుల మీద పడిన కన్నీటి రుచిని మిగిలిన ఏ రుచులు గెలువలేవు’.అన్న సంకేతం తో కన్నీటితో ఉప్పు తాయారు చేసి అమ్ముతుంది హక్ స్టన్ మూన్ స్టార్ సప్లయ్ అన్న లండన్ కంపెనీ. ఆ ఉప్పు పేరు Salt made from human tears. మనిషి కన్నీటిని నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఆ ఆవిరి చల్లరిస్తే అది ఉప్పు అవుతుందిట. ఇదే వింత అయితే ఇందులో వెరైటీ ఉప్పులు వున్నాయి. బాధ, సంతోషం, కోపం లాంటి బావోద్వేగాలతో కరచిన కన్నీటి తో ఐదు రకాల ఉప్పులు తాయారు చేస్తారు. సాల్ట్ మేడ్ ఫ్రమ్ టియర్స్ ఆఫ్ సారో కొట్టండి ఆన్లైన్ లో బిరడా వేసిన సిసాలో Saddest salt in the world కనిపిస్తుంది. సంతోష సమయంలో జాలువారిన కన్నీటి ఉప్పు ఖరీదు ఎక్కువట. దీన్ని గురించి పెద్ద పెద్ద రివ్యూలు, రిపోర్ట్లు వున్నాయి. ఆన్ లైన్ లో చదువుకోండి.

Leave a comment