ఉబ్బసం వున్నా వారికి బ్రీతింగ్ ఎక్సర్ సైజులు మేలు చేస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యాధికిసంబందించిన చికిత్స తీసుకుంటున్న బ్రీతింగ్ ఎక్సర్ సైజు చేస్తే ఊపిరి తిత్తుల పని తీరు మెరుగైందనీ, గాలిగొట్టాల్లో ఇన్ ఫ్లమేటషన్ తగ్గిందని అద్యాయినాలు రుజువు చేసాయన్నారు. కొన్ని వందల మంది పై జరిగిన ఈ అద్యాయినంలో ఉబ్బసం అటాక్ వ్యాయామం చేసిన వారిలో తక్కువగా వుందని తేలిందిట. ఈ అద్యాయినం, ఉబ్బసం వ్యాధి తో బాధ పడే వారికి  ఎంతో ఉపసమనంగా ఉంటుందని చికిత్స కోసం పెట్టవలసిన ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని చెప్పుతున్నారు. ఈ చలి రోజుల్లో ఈ వ్యాధి వున్న వాళ్ళు అనుభవించే ఇబ్బందులు వర్ణనాతీతం అందుకే ఇలాంటి అద్యాయినాలు చాలా అవసరం.

Leave a comment