40 దాటితే జీవితపు మొదటి గంట కొట్టిందనీ ఇక అరవై దాటితే ఇంకేం జీవితం లే అనే అనుకుంటాం. సాధారణంగా ఓల్డ్ ఏజ్ మొదలైనట్లు ఇక ఇక్కట్ల లో పడినట్లు అనిపిస్తుంది. కానీ చిలీ కి చెందిన ఎలీనా గాల్వేజీ అనే 90 ఏళ్ల  ముసలమ్మ మాత్రం ఆలా ఎప్పటికీ అనుకోలేదు. ఎలాగంటే ఈ వయసులో ఈ బామ్మ  సైకిల్ తొక్కుతుంది. ప్రతి రోజూ ఏకధాటిగా 30 కిలో మీటర్లు ప్రయాణం చేస్తోంది. పాలు ,గుడ్లు స్వయంగా అమ్ముకుని వచ్చిన ఆదాయంతో జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు చెపుతోంది. వయసనేది కేవలం నంబర్ల లోనే అంటుందీ బామ్మ. ఎంత వయసొచ్చినా  ఇంకా ఇతరులపై ఆధారపడే వాళ్ళు లేదా కాస్త పెద్దయితే  చాలు మరణ భయం తోనో చుట్టుపక్కల వాళ్ళ ప్రాణాలు కొరికేవాళ్ళకి ఈ బామ్మ గారి వీడియో  యూట్యూబ్ లో వుంది చూపెట్టండి.

Leave a comment