సౌందర్య ఉత్పత్తుల్లో రసాయనాలు ఉంటాయి. ఒక్కసారి ఈ రసాయనాల ప్రభావం చర్మం పైన పడుతుంది అప్పుడు చర్మం కొన్ని సంకేతాలు ఇస్తుంది చర్మంపైన చిన్న ఎర్రని బుగ్గలు ఏర్పడి పగుళ్ళు వస్తే ఉపయోగించే సౌందర్య సాధనాలలో సల్ఫేట్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలి మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ లో సోడియం లారైల్, సల్ఫేట్ పాళ్ళు ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి. ఒక్కసారి చర్మం పైన ఎక్కువ జిడ్డు లేదా పొడిగా కనిపించవచ్చు. అన్ని సీజన్లలో ఒకే రకం సౌందర్యసాధనాలు వాడకూడదు ప్రతి సీజన్లో చర్మంపైన ఒక్కోలా ప్రభావం చూపెడుతుంది. చలికాలంలో మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అవసరం చాలా ఎక్కువ వేసవిలో తేలికపాటి వాటర్బ్
మాయిశ్చరైజర్ వాడితే మంచిది.

Leave a comment