గుడ్లతో కూరగాయల కీ పండ్ల కీ పూత పూయటం ద్వారా అవి ఎక్కువ కాలం నిలువ ఉండే విధానాన్ని హౌస్టన్ లోని రైన్  విశ్వవిద్యాలయ నిపుణుల బృందం రూపొందించింది.గుడ్డు సొన నుంచి 70 శాతం బై పాలిమర్ ను,ఇక్కడి నుంచి సెల్యులోజ్ ఫైబర్ ని పసుపు కొమ్ములు నుంచి కర్‌క్యుమిన్‌ ను, కొద్ది పాటి గ్లిజరాల్ నీ కలిపి ఈ పూతను తయారుచేశారు శాస్త్రవేత్తలు. ఈ పూతను పండ్ల పై పూస్తే పండ్లలోని తేమ ఆవిరై  పోకుండా ఉంటుంది.యాంటీ మైక్రోబియల్ గుణాల తో సూక్ష్మజీవులు రానివ్వదు. త్వరగా పాడయ్యే అవకాశం ఉన్నా అవకాడొలు,  అరటి పండ్లు వంటివి ఈ పూత పూసే ఎంతో కాలం నిల్వ ఉంటాయి పైగా ఎలాంటి హానీ ఉండదు.టాప్ కింద నీళ్లతో కడిగితే శుభ్రంగా ఉంటాయి కూడా.

Leave a comment