ఒక సర్వే రిపోర్టు చూడండి. 2000 సంవత్సరంలో ఏకాగ్రత విషయంలో ఒక సర్వే చేస్తే ఒక విషయంలో ద్రుష్టి కేంద్రీకరించటం 12 సెకెంన్లుగా వుంటే ఈ సంవత్సరం 8 సెకెన్లకు కిందికి దిగింది. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ ఎలక్ట్రోనిక్ యుగంలో వందలాది గాడ్జెట్స్ వినియోగం ఏకాగ్రతను దెబ్బతిస్తున్నాయని ఆ వ్యసనం దృష్టిని కేందీకరించే శక్తిని మనం నుంచి దూరం చేస్తున్నాయని రిపోర్టు. కంటి చూపు తగ్గుతుంది. వినికిడి తగ్గుతుంది. వెన్నుముక్క బలహీనం అవుతుంది. సోషల్ మీడియా యాప్స్ వల్ల స్మార్ట్ ఫోన్ లోని గేమ్స్ వల్ల ఏకాగ్రత పోతుంది. ఇప్పుడు ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఏకాగ్రత ని దృష్టిని పొందాలంటే యోగా ప్రక్రియలు సాధన చేయడం ఒక్కటే దారి అని మోబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకం తగ్గించమని చెప్పుతున్నారు.

Leave a comment