భారతదేశం లోని ఎత్తైన గణపతి విగ్రహం తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం లోని  ఆవంచ గ్రామంలో ఉంది. 30 అడుగుల ఎత్తు 15 అడుగుల వెడల్పు ఉన్న ఏకశిలా విగ్రహం ఇది. ఈ విగ్రహం 9.144 మీటర్ల ఎత్తు ఉంది ఉంటుంది. దాన్ని ఐశ్వర్య గణపతి, ఆవంచ గణపతి అని కూడా పిలుస్తారు. 12వ శతాబ్దంలో ఆవంచ లో పశ్చిమ పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన తైలంపుడు పెద్ద గ్రానైట్ బండ రాతిపై ఆ పురాతన గణపతి విగ్రహాన్ని చెక్కించాడు. ఈ విగ్రహం వ్యవసాయ క్షేత్రంలో ఉంది. విగ్రహానికి గుడి చుట్టూ గోడ లేదు.

Leave a comment