పాత ఫోటోలు చూస్తూ వుంటే దిగులేస్తుంది. ఎంత సన్నగా, నాజుగ్గా, తేలిగ్గా వున్నాం అనుకుంటారు. అప్పుడిక ఏది తినలనిపించదు. బాగా డైట్ చేసి సన్నగా అయిపోవాలని తీర్మానించుకుంటారు. తీరా కళ్ళ ఎదుట ఇష్టమైన పదార్ధాలు కనిపించగానే హాయిగా తినేసి, తర్వాత తీరిగ్గా విచారించటం అందరి అనుభవంలో వచ్చేదే. అసలు శ్రద్ధగా, నిష్టగా సన్నబడి తీరాలి అని నిశ్చయించుకుంటే ముందుగా ఇష్టమైన పదార్ధాల్లో వేటిలో ఎక్కువ కేలరీలు వుంటే వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఉదాహరణకు బ్రెడ్ తినే అలవాటు వుంటే వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ట్రై చేయాలి. చక్కర రెండు చెంచాలు వేసే చోట ఒక స్పూన్ వాడుకోవాలి. వంట నూనె మార్చాలి. ఆలివ్ ఆయిల్ వినియోగం పెంచాలి. పదార్ధాలు కొత్తగా వండాలి. రుచి కోసం ఒకటి రెండు పదార్ధాలు కలుపుతూ నూనె తక్కువతో తినాలి. ఇలాంటి ట్రిక్స్ తో కడుపు మాడ్చుకోకుండా సన్నబడచ్చు.
Categories
WhatsApp

ఎక్కువ కేలరీలుంటే పక్కన పెట్టాలి

Leave a comment