Categories
ఈ పోటీ ప్రపంచంలో గెలవాలంటే అబ్బాయిల కన్నా ఎక్కువ స్థిరత్వం, సహనం, ధైర్యం ఉండాలి. అప్పుడు నచ్చిన రంగంలో కృషి చేసి గెలవచ్చు అంటుంది ఫ్యాషన్ డిజైనర్ గౌరీ నాయుడు.ఇంజనీరింగ్ చదివిన గౌరీ నాయుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంచుకున్నారు చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, పూజా హెగ్డే వంటి స్టార్స్ కు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. నటీనటులకు దుస్తులు డిజైన్ చేయాలంటే ఫ్యాషన్ ధోరణలు తెలియాలి. పాత్రకి అద్దం పట్టేలా దుస్తులు ఉండాలి. ముఖ్యంగా అభిమానులకు నచ్చాలి అప్పుడే హిట్ కొడతాం అంటుంది గౌరీ నాయుడు.