ఇంటి పని వంటపని పిల్లల చదువులు అన్నీ ఒక్కరే బాధ్యత తీసుకుంటే రక్తపోటు అధికమయ్యే ప్రమాదం ఉంటుందిట. రోజు ఎనిమిది గంటలు నిద్రపోవయినా పెద్ద నష్టం లేదు. మధ్యాహ్నం వేళ కాసేపు నిద్రపొతే అలసట వుండదు. పులసిన ఆహారం ఇష్టపడే వాళ్ళలో, ఆందోళన, మానసిక పరమైన రుగ్మతులు తక్కువగా ఉంటాయట. రోజుకి 3300 మిల్లీ గ్రాముల పైన ఉప్పు తీసుకుంటే బి-పి తో పాటు తలనొప్పి వస్తుందిట. నడవడం సైకిల్ తొక్కడం ఎంత మంచివో అంతే సమానంగా యోగా వల్ల కుడా ఫలితం ఉంటుందిట. పైగా యోగా తో బిపి, చెడు కొలెస్ట్రోల్, ఊబకాయం అన్ని తగ్గి పోతాయిట.

Leave a comment