ప్రతి ఉదయం ఓట్ మీల్ తింటూ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గి పోతుందనీ,బరువు తగ్గటంలో సహాకరిస్తుందనీ ఎక్స్ పర్ట్ చెపుతున్నారు. ఒక కప్పు గిన్నెడు ఓట్ మీల్ లో యాంటీఆక్సీడెంట్స్ ఖనిజాలు, విటమిన్లు ప్రోటీన్లు, ఐరన్ కాంప్లేక్స్ ,కార్బొహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. వీటిలోని కరిగిపోయే పీచు నీటిని పీల్చి జీర్ణక్రియకు సహాకరిస్తుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్ని స్థిరపరుస్తుంది.ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతోంది.ఓట్స్ రుచికరంగా ఉండవు అనుకొనేవాళ్ళు వాటితో ఎన్నో రకాలుగా వండవచ్చు .పాలు,సోయా మిల్క్ ల్లో కలుపుకోవచ్చు. తీయగా ,ఉప్పగా తయారు చేసుకోవచ్చు .తేనే ,జామ్ ,పెరుగు ,వెన్న ,ఇతర సెరల్స్ చాక్లెట్స్,నట్స్ ఏదైనా కలుపుకొని చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. రోజు అల్పహారంగా తీపుకొనేందుకు పండ్లు ఇతర ఏ పదార్ధాలతోనైన సిద్ధం చేసుకోవచ్చు. కానీ తింటే మంచిది పూర్తి భోజనం లో ఉన్నన్నీ ఓట్స్ లో దొరుకుతాయి.
Categories