మంత్రులు ఎక్కడైన పైకిల్ తొక్కుకుంటూ వెళ్ళటం చూశామా? న్యూజిలాండ్ రవాణా మంత్రి జూలీ జంటర్ మాత్రం మంత్రి కార్యాలయం వరకు కారులో వెళితే మిగతా సమయంలో ఆమె సైకిల్ పైనే ప్రయాణం చేస్తుంది. ముఖ్యమైన విశేషం గత నవంబర్ లో ఆమె గర్భవతి అయింది. ఆ విషయం గురించి ఆమె ట్విట్టర్ లో నా సైకిల్ కు ఇంకో సీటు అదనంగా మార్చే సమయం వచ్చింది అని పోస్టు చేసింది. ఆదివారం ఆమెకు పురుటి నొప్పులు మొదలయ్యాయి .ఇంటికి కిలో మీటర్ దూరంలో ఉన్నా ఆక్లేండ్ సిటీ ఆస్పత్రికి భర్త పీటర్ నన్స్ తో కలిసి బయలు దేరింది. ప్రయాణం లేటవుతోంది అనుకొందో ఏమో సైకిల్ తీసి రయ్ మని తొక్కుతూ వెళ్ళిపోయింది. ఆమె ఆలా వెళ్ళటాన్ని ఆమెతోడుగా సైకిల్ పై వెళుతూ ఆమె భర్త ఫోటో తీసి ఇన్ స్టా గ్రామ్ లో పెడితే అదిప్పుడు వైరల్ అయింది.

Leave a comment