పిల్లలకి ఎప్పుడు సరదా కావాలి. తినేందుకు కొత్తవి కావాలి. గమ్మత్తుగా ఉండాలి ఆ సరదా తీర్చేందుకు వచ్చాయి స్టోన్ చాక్లెట్స్ లేదా పేబుల్ క్యాండీ పేరుతో వచ్చిన తియ్యని రాళ్ళు చూసేందుకు అచ్చంగా ఇవి రాళ్ళ ముక్కలు. వీటిని చాక్లెట్ తోనే తయారు చేస్తారు. పైన పంచదార కోటింగ్ ఉంటుంది. అచ్చంగా మట్టి రోడ్ల పక్కన కనిపించే గులక రాళ్ళ లాగా ఉంటాయి. ఏ పుట్టిన రోజునో ఈ ప్యాకెట్స్ ఫ్రెండ్స్ కు పంచితే ఇదేమిటి రాళ్ళు ఇచ్చావ్ అనేంత సహజంగా ఉన్నాయి. ఆన్ లైన్ లో ఇమేజ్ చూసి మరి ఆర్డర్ ఇవ్వచ్చు.

Leave a comment