మనకు నోరూరించే ఆహార పదార్ధాలు మరి అంత దూరంగా ఉండక్కర్లేదు. కాకపోతే కొన్నికాంబినేషన్స్ లో వాటిని పోషకాహారాలుగా మార్చేయవచ్చు. ఇడ్లి,దోశె,ఊతప్పం వంటివి సాంబార్ గ్రీన్ చట్నీతో తినాలి.అలా తింటే ప్రోటీన్లు లభిస్తాయి.కొబ్బరి చెట్ని కొవ్వు పెంచగలదు. పావ్ బాజీని పెసరపప్పు వంటకంతో కలిపి తీసుకుంటే పావ్ బాజీ జంక్ ఫుడ్ కాదు.నూడిల్స్ నూనెలో ఉడికించి కూరగాయల ముక్కలతో పన్నీర్ తో కలిపి తింటే శరీరానికి కావల్సిన ప్రోటీన్లు లభిస్తాయి. పిజాకు బీన్స్ సలాడ్ కలపవచ్చు.మాములుగా ఎప్పుడు తినే ఫ్రైడ్ రైస్ బదులు శనగలు రజ్మాలు కలిపిన ఫ్రైడ్ రైస్ తింటే అవసరమైన ప్రోటిన్లు పప్పు ధాన్యాలు లభిస్తాయి.

Leave a comment