బరువు తగ్గిపోవాలనే ఆతృతతో చాలా పొరపాట్లు చేస్తారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.తక్కువ కాలరీలున్న ఆహారం తీసుకుంటే బరువు తగ్గతారు అనుకుంటారు. అలా చేస్తే కొవ్వుతో పాటు కండరాలను కోల్పోతారు అంటున్నారు. జీవక్రియ పని తిరు కూడ తగ్గిపోతుంది. అలానే విపరీతమైన వ్యాయామం చేస్తారు.దాని వల్ల అలసట పెరిగి అసలు వ్యాయామం చేయలేని పరిస్థిరి వస్తుంది. అలాగే ఆహారంలో విపరీతమైన మార్పు చేస్తారు.శరీరానికి సరిపడా మాంసకృత్తులు అందకపోతే జీవక్రియలు పని వేగం తగ్గిపోతుంది. కొవ్వు త్వరగా తగ్గి కండరాలు దృడంగా ఉండాలంటే మాంసకృత్తులు అందాలి. కొద్ది కొద్దిగా ఎక్కువసేపు తినడం మంచిదే. అదీ సవ్యంగా ఉండాలి. ఉదయపు అల్పాహరం ప్రతి మూడు గంటలకొకసారి పండు లేదా పండ్ల రసం గ్రీన్ టీ ,డ్రై ఫ్రూట్స్ ఇలాగే తీసుకోవాలి.

Leave a comment