ఇల్లు సర్దటం లో కొన్ని టిప్స్ అమలు పరిస్తే పర్ ఫెక్ట్ గా పని అయిపోతుంది. ప్లాస్టిక్ డబ్బా ఘాటైన మసాలా ధినుసులు పెడతారు. తరువాత ఆ మసాలా వాసన ఎంత కడిగిన పోదు. ఆ వాసన పోయేందుకు ఒక అగ్గిపుల్ల వెలిగించి ఆర్పేసి ఆ వచ్చే పొగపైన డబ్బా బోర్లిస్తే చాలు వాసనలు పోతాయి. అగ్గిపుల్ల మంటను ఆర్పినపుడు వచ్చే పొగకు డబ్బా శుభ్రంగా అయిపోతుంది. కూరలు తరిగే ప్లాస్టిక్ బోర్డ్ పై,డైనింగ్ టేబుల్ పై మరకలు ఉంటే నిమ్మచెక్క తో రుద్ది కాసేపయ్యాక నీళ్ళతో కడిగేస్తే మరకలు,మురికి రెండు పోతాయి. అన్నీ ఒకేసారి సర్దేయకుండా ఒక రోజు అవుటర్ ఏరియా,రెండో రోజు డైనింగ్ ఏరియా సర్దుకోవాలి.

Leave a comment