లిప్ స్టిక్ వేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పర్ ఫెక్ట్ గా ఉంటుంది అంటున్నారు మేకప్ నిపుణలు. పెదవులు ఎండిపోయినట్లు పొరలు ఊడుతున్నట్లు ఉంటే లిప్ స్టిక్ బాగుండదు. ఈ సమస్య నివారణకు రాత్రివేళ పెదవులకు కాస్త వెన్న గాని పెట్రోలియం జెల్లీ గాని రాస్తే సరిపోతుంది. ముందు అవుటర్ లైన్ గీసుకుని ఆ తర్వాత లిప్ స్టిక్ వేసుకుంటే బయటకు పోకుండా ఉంటుంది. లిప్ బ్రష్ సాయంతో మధ్య భాగం నుంచి అచ్చులకు వేయాలి లిప్ స్టిక్ పాయింటెడ్ గా ఉంటేనే వేయటం సులువు. లిప్ బామ్ తో పెదవులు మర్దనా చేసి తర్వాత లిప్ స్టిక్ వేసుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్ తో అద్దెయాలి. రెండు రంగులు ఒకదాని తర్వాత ఒకటి వేసి అవసరమైన షేడ్ వచ్చేలా వేసుకోవచ్చు.

Leave a comment