ఇప్పుడు కొత్తగా 12 గంటల ఒకసారి ఆహారం తీసుకొంటే  మంచిదనే ప్రచారం జరుగుతుంది కానీ ఆహారం సమతలమైనది గా ఉంటేనే ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పరిపూర్ణ ఆరోగ్య వంతులైన వారు ఎక్కువ సార్లు తక్కువ పరిమాణం లో భోజనం చేసినా లేదా పన్నెండు గంటల కోసారి తగిన ఆహారం తీసుకొన్న వారి శరీరం గ్లూకోజ్ ని సక్రమంగా నియంత్రిస్తుంది .కాబట్టి హైపర్ గ్లైసిమియా లేదా హైపో గ్లైసిమియా లాంటివి రావు .కానీ ఇతర ఆహార సమస్యలు ఉన్న వారు వీలైనంత వరకు రోజుకు  నాలుగు లేదా ఐదు సార్లు పరిమిత మోతాదులో ఆహారం తీసుకోవాలి . ఆరోగ్యం వంతులు కూడా తక్కువ మోతాదులో ఆహారం ఎక్కువ సార్లు తీసుకొంటే నష్టమేమి ఉండదు .కానీ అది చక్కని పోషకాలతో నిండి ఉండాలి .

Leave a comment