పొడవాటి సీసాల్లో ఎన్నో కూల్ డ్రింక్స్ పానీయాలు కొనుక్కొని తెస్తారు. వాటి మూతలు ఓపెనర్ల సాయంతో తీసేశాక మళ్ళి పెట్టటం సాధ్యంకాదు . ఒక్కసారి కొన్ని దగ్గు మందులు ,సిరప్ ,సిసాలు ,మంచినీళ్ళ సిసాలు కూడా మూతలు పోతే మళ్ళీ ఉపయోగించేందుకు కుదరదు . మార్కెట్ లో రకరకాల సైజుల్లో బాటిల్ స్టాపర్స్ వచ్చాయి . వీటిని ముఖ్యంగా వైన్ బాటిల్స్ కోసం వాడతారు కనుక వైన్ స్టాపర్స్ అంటారు . కానీ ఇవి మూత పొడుగ్గా ఉన్న ఎలాటి సీసాలకైనా చక్కగా అమరుతాయి . ముఖ్యంగా ఈ మూతలు చాలా బావున్నాయి సన్ ఫ్లవర్ షేపులు,కీరదోస ముక్కలాగా ,సూపర్ మూన్ బొమ్మ ,అందంగా ఉండే హై హీల్ ,తలదూర్చేసిన పిల్లలు ,కోళ్లు ,చికెన్ షేప్ కార్లు ,కూరగాయల ముక్కలు షేప్ ల్లో భలే ఉన్నాయ్ . ఇవి మూతలు పోయిన సీసాల కోసం మంచి ఉపయోగం .

Leave a comment