గంటల కొద్దీ కూర్చుంటే ,విమాన ప్రయాణాలు చేస్తుంటే ,కాళ్ళు ముడుచుకొని కూర్చోవటం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోతుంది. కాలి రక్తనాళాల్లో సమస్యలుంటే మరీ ఇబ్బంది .ఇలాంటి సమస్యలు ఉంటే డాక్టర్స్ కంప్రెషన్ సాక్స్ వేసుకొమ్మని సిఫార్స్ చేస్తున్నారు. ఇవి మోకాళ్ళ వరకు ఉంటాయి. రక్త ప్రసరణ సాఫిగా జరిగిపోయోలా చేస్తాయి. దూర ప్రాంతాలు ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువ సేపు కూర్చోని పని చేసేవాళ్ళు ,కాలి రక్త నాళాల సమస్యలుంటేనూ ఇవి ధరించటం ఆరోగ్యం అంటున్నారు. ఆన్ లైన్ లో ఆర్డర్ ఇవ్వచ్చు .వీటి ధర 350 రూపాయాల నుంచి 2000 వరకు ఉన్నాయి.

Leave a comment