దక్షిణ భారత మహిళలు వేడుకల్లో చీరలు కట్టే తీరులో ఎంతో వైవిధ్యం కనబరుస్తున్నారు. సాంప్రదాయ చీరెకట్టుకు ఆధునిక శైలిని జోడిస్తున్నారు ప్రింటెడ్ శారీని, లాంగ్ స్కర్ట్ తో జత చేస్తే పార్టీల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు పాంట్ శైలి శారీ అయితే కుచ్చిళ్ళను ప్యాంట్ కు జోడించి వడ్డానం లేదా లెదర్ బెల్ట్ పెడుతున్నారు. ఇంకో వినూత్నమైన శారీ డ్రేపింగ్ చీరె కుచ్చులు వెనక్కు పెట్టుకోవటం ఇంకా లెహంగా  శైలిలో చీరె కట్టించుకోవటం కూడా ఇవ్వాట్టి ఫ్యాషన్ అలాగే సాలిడ్ కలర్ జరీ చీరెలు రెండు తీసుకుని రెండింటిని కలిపి ధరించటం ఇంకో సరికొత్త లుక్. అలాగే చక్కని చీరెకు బ్రైట్ లుక్ సిల్క్ దుపట్టాను కలిపి ఎంబ్రాయిడరీ వడ్డానం పెట్టుకుంటే ఎలాంటి ఫంక్షన్స్ లో అయినా చీరె చక్కదనం కనిపిస్తూ చక్కని లుక్ ఇస్తుంది.

Leave a comment