Categories
ప్రకృతి పైన ప్రేమ ఎప్పుడు మనిషిని వదలదు. అంతు చిక్కని సముద్రం,ఆకాశం,రాత్రి నక్షత్రాలు ఇవన్ని ఎపుడు మోహ పెడతాయి . సరేమరి సముద్రపు అలలపైనా ఆకాశం కింద జాబిల్లిని చూస్తూ నిద్రపోండి. మాల్దీవుల్లో వుండే గ్రాండ్ పార్క్ కొదిప్పరు రిసార్ట్ కు వచ్చింది అంటున్నారు నిర్వహకులు. మరు మూల దానిలో ఉన్న ఈ రిసార్ట్ కు చెందిన 120 విల్లాలు సముద్రం నీళ్ళలో వుంటాయి. ఆవిల్లాలను అనుకోని నీళ్ళ పైన చక్కని వల మంచాలుంటాయి. ఆ మంచాల పైన పడుకుంటే చుట్టు సముద్రం,పైన ఆకాశం,చుట్టు అంతే కనిపిస్తాయి. ఈ అలల వడిలో నిద్ర పోయేందుకు ఎంతోమంది ఉత్త్సహం చూపిస్తున్నారట.