సిల్క్ అనగానే ముట్టుకొంటే జారిపోయే మెత్తని మైసూరు సిల్క్ చీరెలు గుర్తురాక మానవు. సాదాగా,చక్కని పెద్ద డిజైనర్ పైట కొంగుతో కనీసం వందేళ్ళుగా దక్షణాది స్త్రీల మనసులో పీఠం వేసుకొని కూర్చొని ఉన్నాయి ఈ అందమైన చీరెలు. అసాంప్రదాయి చీరెలకు బందిని స్టయిల్ కసుటి ఎంబ్రాయిడరీ పిందెల బుటీలు ,డబుల్ లైన్ చెక్స్ హెవీ పల్లు తో వచ్చాయి. ప్యూర్ సిల్క్ ,ప్యూర్ గోల్డ్ జెర్రీ తో వుండే ఈ చీరెలు కాస్త ఖరీదు ఎక్కువే కానీ చక్కని బంగారు జరి ప్యూర్ క్రెప్ సిల్క్ తో ఈ చీరెలు ఎంతో తేలికగా అందంగా సౌకర్యంగా ఉంటాయి.

Leave a comment