తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో మొట్టమొదటి మహిళా డ్రైవర్ గా చరిత్ర సృష్టించింది వాంకుడోత్ సరిత. యాదాద్రి జిల్లా సీత్యాతండా లో వ్యవసాయ కుటుంబంలో పుట్టింది సరిత. ఒక స్వచ్ఛంద సంస్థ సాయంతో ఢిల్లీలో డ్రైవింగ్ శిక్షణ తీసుకొని హెవీ వెహికల్ లైసెన్స్ తెచ్చుకుంది సరిత. పదేళ్లపాటు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో పనిచేసింది. హైదరాబాద్ జె బి ఎం విద్యుత్ బస్ నడిపే అవకాశం తెచ్చుకుంది. ఈ హైదరాబాద్ ఉద్యోగం తో నా తల్లి తండ్రులను దగ్గర ఉండి చూసుకోగలరు అదే ఎంతో సంతోషం అంటుంది సరిత ఢిల్లీ రోడ్ల కంటే హైదరాబాద్ లో డ్రైవింగ్ చాలా సులువు అంటుంది ఈ మహిళా డ్రైవర్.

Leave a comment