పద్దెనిమిదేళ్ళ ఎమ్మా రదుకాను ఇప్పుడు క్రీడా రంగంలో సరికొత్త సెలబ్రెటీ. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక గ్రాండ్‌స్లామ్‌ లో అడుగు పెట్టి టైటిల్ గెలిచి, ఎన్నో రికార్డ్ లు సాధించిన ఎమ్మా పేరు టెన్నిస్ వర్గాల్లో సుపరిచితురాలే. తొమ్మిదేళ్ళ వయసులో LTA వింటర్ నేషనల్స్ లో ఆమె విజేత. 13 ఏళ్ల వయసులో మొదటి జూనియర్ ఐ ఎఫ్ టి టైటిల్ గెలుచుకుంది. గత వారం న్యూయార్క్ లో జరిగిన యూఎస్‌ ఓపెన్ లో సాధారణ ప్రదర్శన చేసిన ఎమ్మా 150 వ ర్యాంక్ నుంచి ఏకంగా 23 వ ర్యాంక్ కు దూసుకుపోయి 53 ఏళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ లో విజేతగా నిలిచిన బ్రిటన్ క్రీడాకారిణిగా, రెండవ అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ లు తిరగరాసింది.

Leave a comment