Categories
WhatsApp

ఎమోషనల్ ఇంటలిజెన్స్ వుంటే సంబంధాలు పదిలం

ఎమోషనల్ గా ఉండే వాళ్ళలో మేధావితనం వుంటే విజయం సాధించడం సులువు అవుతుందని సాధారణంగా అందరికీ తెలిసిందే. అయితే ఎమోషనల్ గానూ, తెలివి గానూ ఉండేవాళ్ళకి తమ సొంత ప్రయోజనాలకు కూడా ఇతరుల భావోద్వేగాలను ప్రభావితం చేయగల శక్తి సామర్ధ్యాలు ఉండి ఉంటారని ఇటీవల వాషింగ్టన్ లో జరిగిన పరిశోధనల్లో గుర్తించారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్ అంటే సొంత, ఇతర భావోద్రేకాలను సరైన రీతిలో క్రమబద్దీకరించుకోగలగటం. దీని వల్ల సామాజిక ప్రవర్తన, వ్యక్తిగత సంబంధ భాంధవ్యాలు బావుంటాయి. అయితే వీళ్ళు తమ భావోద్రేకాల విషయంలో స్మార్ట్ గా వ్యవహరించడం కాకుండా ఇతరుల నిర్ణయాలను కూడా తమకు అనుకూలంగా మార్చగల సామర్ధ్యం కలిగి ఉంటారని తాజా పరిశోధనలు పేర్కొంటున్నాయి. మొత్తంగా ఎమోషనల్ మేధావితనం వుంటే సంబంధాలు బావుండటం ఆహ్వానించదగిన విషయం.

Leave a comment