నగలు కొనేటప్పుడు ఎంపికలో ధరల్లో వాడకం విషయంలో ఎన్నో జాగ్రత్తలు అడిగే తెలుసుకుని మరి కోనుక్కోవాలి. బంగారు నగకు 24 క్యారెట్ల హోల్ మార్కింగ్ ఉందా.బిల్లింగ్ లో బరువు ఎంత వేశారు తరుగు కలిసిందా లేదా మేకింగ్ చార్జ్ ఏ స్థాయిలో ఉందో చెక్ చేసుకోవాలి. సాధరణంగా మిషన్ మేడ్ నగ తరుగు 8శాతం ఉంటుంది.హ్యాండ్ మేడ్ నగలో తరుగు 12నుంచి 18 శాతం ఉంటుంది. మోజోనెట్ అన్ కట్ వీటిలో నగ ఏదికొంటామో చూసుకుని అడిగి తెలుసుకోవాలి. మోజోనెట్ రాళ్ళ క్యారెట్ విలువ 15 వందల నుంచి 2,500 వరకు ఉంటే అన్ కట్ రాళ్ళ వ్యాల్యూ క్యారెట్ 12 నుంచి 18 వేల ధర పలుకుతాయి. ప్రతి నగకు ఐజీఏ సర్టిఫికెట్ తీసుకోవాలి.ధుఖాణదారులు క్రాప్ వెయిట్ వేస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. నగలు ఖరీదు కనుక ప్రతిది జాగ్రత్తగా చూసుకోవాలి.

Leave a comment