పిల్లల గదిలో ల్యాప్ టాప్ లు ,కంప్యూటర్లు ,టీవీలు ఉంచితే చదువు పాడవుతుందని అనుకుంటారు కానీ ముఖ్యంగా వారిలో ఊబకాయం రావటానికి ఇదే కారణం అంటున్నాయి పరిశోధనలు.  పిల్లలు టీవీ చూస్తూ,ల్యాప్ టాప్ లో గేమ్స్ ఆడుతూ చక్కగా జంక్ ఫుడ్ తినేస్తారు. గంటల కొద్ది కదలకపోవటం జంక్ ఫుడ్ కారణంగా వారిలో ఊబకాయ సమస్య వస్తోంది. గంటల తరబడి స్కూల్లో కూర్చోనే గడపడం ,శారీరక శ్రమ లేకుండా టిఫిన్లు ,భోజనం చేయటం, ఇంటికి రాగానే టీవీ ముందు కూర్చోవటం ఎన్నో అనారోగ్యలకు కారణం అవుతోందన్నారు .పిల్లలకు శారీరకమైన కదలికలు ,ఎండ వేడి ,ప్రకృతిని చూసే అవకాశం ఎదీ లేకపోవటం దురదృష్టకరంగా వారు పేర్కొన్నారు.

Leave a comment