మలయాళ అమ్మాయి నివేదా థామస్ తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా చేస్తూ పూర్తిగా తెలుగు అమ్మాయిలా అయిపోయిది. మరి తెలుగు బాగా వచ్చా అని అడిగితే  నివేదా ఇప్పటికి ఎదుటి  వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకొంటున్నాను. చిన్న చిన్న పదాలు మాట్లాడగలను. కానీ తెలుగు ఎలాగైనా నేర్చుకోవాలని రాకపోయిన తెలుగులోనే మాట్లాడుతాను. ఒక సారి సెట్ లో నాకు వేడి నీళ్ళు తాగాలనిపించింది.హాట్ వాటర్ ను వేడి నీళ్ళు అంటారని తెలియదు . ఎండ నీళ్ళు కావాలన్నాను. సెట్ లో అతను ఎండ నీళ్ళు ఏమిటో అర్థం కాక ఎంతో ఇబ్బందిపడ్డాడో. కాసేపటికి అర్థమై తెగ నవ్వాడు. నవ్వినందుకు నాకు కోపం వచ్చిన నేను అడిగింది నాకు అర్థమై నేను నవ్వాను. ఇలాంటి తప్పులు ఎన్నో . అయినా నేను తెలుగు మాట్లాడుతూ నా భాష మెరుగు పరుచుకొన్నా.

Leave a comment