ఎండా పెరిగితే చాలు ఆ ప్రభావం తో ముఖం నల్లగా అయిపోతుంది. ఇంట్లో దొరికే వస్తువులే రసాయన ఉత్పత్తుల కంటే బాగా పనిచేస్తాయి. ఎండలో తిరిగొచ్చాక ఒక చిన్న బొప్పాయి ముక్కను మొహానికి రాసుకుని పది నిముషాలు తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే మురికి నలుపుతనం తగ్గి చర్మం కాంతివంతంగా అయిపోతుంది. రెండు చెంచాల ఓట్స్ పొడిలో కాసిని పాలు పోసి మర్దనా చేసి ముఖానికి మర్దనా చేయాలి. కాసేపాటికీ కడిగేస్తే మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా అయిపోతుంది. పెరుగులో టొమాటో గుజ్జు కలిపి మొహానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత కడిగేస్తే తమతో లోని బ్లీచింగ్ మురికినీ నలుపు దనాన్ని పోగొడుతుంది. సెనగపిండి పాలు మిశ్రమం కూడా నలుపు పోగొట్టోటంలో బాగా పనిచేస్తుంది. నిమ్మరసం తేనె  సమపాళ్లలో తీసుకుని ముఖానికి పూతగా వేసుకుని పావుగంట తర్వాత కడిగేసుకోవాలి. ప్రతి రోజు స్నానానికి ముందు ఇలా చేస్తే చర్మం మెరిసి పోతూ  కళగా ఉంటుంది. టమాటో  గుజ్జు నిమ్మరసం కూడా మురికిని తొలగించి చర్మం కాంతివంతంగా అయ్యేలా చేస్తాయి.

Leave a comment