వేసవిలో ఎండ, చెమటకు మేకప్ ఎక్కువసేపు మొహం పైన ఉండదు. పొడి చర్మానికి వేసవిలో మాయిశ్చరైజర్ అవసరం ఉండదు. అయితే వాటర్ ప్రూఫ్ మేకప్ వాడితే మంచిది. లిక్విడ్ ఫౌండేషన్ వేసి మస్కర్, లైనర్ తో కళ్ళను దిద్దుకున్నాక బుగ్గలకు బ్లష్ అద్ది టిష్యూ పేపర్ తో అదనపు రంగు తొలగించవచ్చు. ఇక జిడ్డు చర్మం ఐతే ఐస్ తో మొహం రబ్ చేసి ఫౌండేషన్ వేయాలి. ముందుగా ప్రైమర్ వాడాలి. దాని పైన వాటర్ బేస్డ్ పాన్ కేక్స్ ఉపయోగించాలి. ఇక తర్వాత కళ్ళు పెదవులు తీర్చిదిద్దుకోవాలి. ఇక కాంబీనేషన్ స్కిన్ ఐతే మేకప్ ముందు మొహం అంతా ఐస్ తి రబ్ చేయాలి. నుదురు,గడ్డం, ప్రైమర్‌ వాడాక కళ్ళు,పెదవులు,బుగ్గలు దిద్దుకోవచ్చు.

Leave a comment