తలైవి సినిమా విడుదలకు ముందే కంగనా ఫస్ట్ లుక్ విడుదల కాగానే అంతులేని ప్రశంసలు దక్కాయి మణికర్ణిక కు కాస్ట్యూమ్స్ ఇచ్చాక తలైవి కి కూడా పని చేయమని కంగనా అడిగారు ఇక ఎంతో వర్క్ అలనాటి చీరెలు సంపాదించి నాటి డ్రెస్ లు చెప్పులు, బ్రాలు కూడా స్టడీ చేసి మరీ జయలలిత ను కంగనా లో సృష్టించ గలగాను అంటుంది ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా చాందిని, తాళ్, జోధా అక్బర్, దేవదాస్ వంటి భారీ చిత్రాలకే కాస్ట్యూమ్స్ చేసిన నేను నీతా తెలుగులో మొదలైన శకుంతలం కోసం కాస్ట్యూమ్స్ అందిస్తోంది మహిళా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇప్పటికి నాలుగు సార్లు జాతీయ అవార్డు పొందింది నీతా లుల్లా.

Leave a comment