నీహారిక,

నాకు అన్నట్లు కొన్ని అనాలోచితంగా మనం చేసే పనుల వల్లనే సమస్యలు వస్తాయి. మనలో చాలామంది ఆడవాళ్ళు ప్రతి పని మనం చేస్తేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఇంట్లో పిల్లలు, భర్త వల్ల పని సరిగ్గా కాదని అనుకొని అన్ని పనులు వాళ్ళ నెత్తిన వేసుకుంటారు. ఇక అంతులేని పనులతో అనారోగ్యం, మానసిక ఒత్తిడి మిగులుతాయి. అందుకే ఇంట్లో ఎవరు చేయదగిన పని వాళ్లకు అప్పగిస్తే పనిభారం తగ్గుతాయి. ఇది ఆఫీస్ లో కూడా వర్తిస్తుంది. అలాగే మనం చేసే పనిలో చిన్నపాటి లోపాలుంటే ఎవరైనా వాటిని ఎత్తి చూపితే దాన్నిసమీక్షిచుకునేందుకు ప్రయత్నించాలి. మనతో పాటు ఇతరులలో ఎత్తి చూపించాలనుకోవడం చాలా తప్పు. వాస్తవికంగా అలాచేస్తే సగం సమస్యలు పోతాయి. ఎన్నో భారాలు తగ్గుతాయి. ప్రతి పనికి ఒక ప్రణాళిక అలాగే షేరింగ్,సమీక్షలు, సలహాలు స్వీకరించడం ఇవే జీవితంలోని బరువు, భారాన్ని తగ్గించే మంత్రాలు.

Leave a comment