తక్కువ ఆహారం ఎక్కువ శక్తి కావాలనుకుంటే రోజంతా ఒకే ఉత్సాహంతో ఉల్లాసంగా పని చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో చేసుకోగలిగే ప్రోటీన్ షేక్ లు  ప్రయత్నించవచ్చు.యాపిల్ ను చిన్న ముక్కలుగా చేసి ఇందులో రెండు మూడు వాల్ నట్స్,అరటిపండు,బాదం పాలు కలిపితే వాల్నట్ జ్యూస్ తయారవుతోంది.అలాగే బాదం పాలలో పావు స్కూల్ బియ్యం గింజలు బెల్లం తురుము వేసి జ్యూస్ చేసుకోవచ్చు.పాలకూరను సన్నగా తరగాలి దీనిలో అయిదారు బాదం పలుకులు పావు స్పూన్ అవిసె గింజలు పావు స్పూన్ బియ్యం గింజలు గ్లాస్ పాలు పోసి జ్యూస్ చేసుకోవచ్చు అలాగే స్ట్రాబెర్రీ ముక్కల్లో ,జీడిపప్పు పాలు పోసి జ్యూస్ చేసుకుంటే ఇవి శక్తిని ఉత్సాహాన్ని ఇస్తాయి.ఎలాంటి రసాయనాలు లేని ప్రొటీన్ షేక్ లు ఇవే .

Leave a comment