తియ్యగా ఉంటుంది కనుక బీట్ రూట్ లో చక్కెరలు కార్బొహేట్డ్రేట్స్ ఉంటాయని అనుకొంటారు కానీ ,అందులో గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలు మాత్రమే ఉంటాయి . ఒక ఫర్వింగ్   బీట్ రూట్ లో ఎనిమిది గ్రాముల చక్కర మాత్రమే ఉంటుంది . ఒక పెద్ద క్యారెట్ లో ఇది సమానం  బీట్ రూట్ పై చర్మంతో సహా వండినా ,రోస్ట్ చేసినా పోషకాలు పోకుండా ఉంటాయి . యాంటీ ఆక్సీ డెంట్స్ ఎక్కువగ ఉండే ఆకులు ,తొడిమలు పారేయకుండా మెత్త బడే వరకు వెల్లుల్లి ఆలివ్ ఆయిల్ తో కలసి వేయించు కొవాలి .  బీట్ రూట్ లో నైట్రేడ్స్ ఎక్కువ,ఎంతో ఎనర్జీ ఇస్తాయి .  బీట్ రూట్ లో నైట్రేడ్స్ ఎక్కువ . ఎంతో ఎనర్జీ ఇస్తాయి .  బీట్ రూట్ జ్యూస్ తాగే ఎథ్లెడ్స్ పదహారు శాతం ఎక్కువ సేపు పని కొనసాగించ గలదని ఓ సర్వే లో తేలింది .

Leave a comment