కొన్ని రకాల పండ్లు శరీర ఆరోగ్యంతో తో పాటు సౌందర్య పోషణలో కూడా ఎంతో ఉపకరిస్తాయి. ఎన్నో ఖనిజాలు, పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలున్న సపోటా పూర్తి స్ధాయి ఆరోగ్యం తో పాటు శిరోజాల, ద్రుష్టిని పరిరక్షిస్తుంది. నడుము కొలతల్ని సమంగా ఉంచుతుంది. రెండు మూడు సపోటాల్లో లభించే ‘ఎ’ విటమిన్ కంటి చూపు మెరుగు పరుస్తుంది. సపోటా జ్యూస్ ఎనర్జీ పానీయం. ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి చక్కరలుండి శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్, A,C,E లు పొడిచర్మానికి తేమ ఇస్తాయి. లైన్స్, ముడతలు నివారిస్తాయి. చర్మం సహజ టెక్షర్ ను కాపాడి కాంతి వంతంగా వుంచడం లో సపోటాలది కీలకపాత్ర. క్యాపిల్లరీలను మరమ్మతో చేయడం ద్వారా వెంట్రుకలు తర్వాత తెల్లబడకుండా చేస్తుంది సపోటా జ్యూస్ లోని విటమిన్-సి జుట్టు కుడుర్ల లోపాలు సారి చేసి ఎదుగుదలకు సహకరిస్తుంది. సీజన్ గా వచ్చే సపోటాను ప్రతి రోజు తప్పనిసరిగా తింటే మేలు.

Leave a comment