ఈ వేసవి ఎండల కు నిరసం  అనిపించకుండా సగ్గుబియ్యం జావ తీసుకోండి అంటున్నారు  న్యూట్రిషనిస్ట్ లు.  సగ్గుబియ్యం లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అలసిన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. వ్యాయామం తరువాత తీసుకో దగ్గ ఆహారం ఇది.  ఇందులోని పొటాషియం రక్త పోటును అదుపులో ఉంచుతుంది. రక్తప్రసరణ సాఫీగా చేసి గుండె పైన ఒత్తిడి లేకుండా  సహాయపడుతుంది. సగ్గుబియ్యం లోని క్యాల్షియం వల్ల ఎముక బలం పెరుగుతుంది వీటిలో పీచు అధికం.ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

Leave a comment