ఇంగ్లీష్ విత్ మెర్లిన్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లీష్ నేర్పుతారు 80 ఏళ్ల మెర్లిన్ పుట్టింది మయన్మార్. బాగా చదువుకొని పిల్లలకు మ్యాథ్స్,ఇంగ్లీష్ పాఠాలు చెప్పేది. పెళ్లయ్యాక చెన్నైలో స్థిరపడిన తర్వాత  అయినవాళ్లు ఒకరి తరువాత ఒకరు చనిపోవడంతో ఒంటరై  80 ఏళ్ల వయసులో భిక్షాటన మొదలుపెట్టింది.ఈమె గురించి విని వృద్ధాశ్రమంలో చేర్చాడు ఒక కుర్రాడు. ఆమె కథ నెట్ లో అయింది. ఎంతోమంది మాకు ఇంగ్లీష్ నేర్పు అని అడిగారు. ఇప్పుడామె రోజువారి కార్యకలాపాల గురించి సులువుగా ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో పాఠాలు చెబుతోంది 6.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Leave a comment